మోదీకి అత్యున్నత పౌర పురస్కారం! | UAE Highest Civilian Award to PM Modi | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీకి యుఏఈ అత్యున్నత పౌర పురస్కారం 

Aug 24 2019 5:43 PM | Updated on Aug 24 2019 6:03 PM

UAE Highest Civilian Award to PM Modi - Sakshi

అబుదాబి : యుఏఈ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీని ఆ దేశం తమ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్‌ ఆఫ్‌ జాయేద్‌తో శనివారం సత్కరించింది. 2015లో అరబ్‌ దేశాల్లో పర్యటించిన మోదీ ఇరుదేశాల మధ్య మత, సాంస్కృతిక, ఆర్థిక రంగాల్లో చేసిన కృషికిగాను ఈ అవార్డును ఇస్తున్నట్టు గత ఏప్రిల్‌లోనే యూఏఈ ప్రకటించింది. ఈ అవార్డును యుఏఇ జాతిపిత షేక్‌ జాయేద్‌ బిన్‌ సుల్తాన్‌ అల్‌ నహ్యాన్‌ పేరుతో ఇస్తారు. ఆయన శతజయంతి సందర్భంగా ఈ పురస్కారాన్ని మోదీకి ప్రకటించడం విశేషం. ఇంతకుముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, బ్రిటన్‌ రాణి క్వీన్‌ ఎలిజబెత్‌ 2, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌లు ఈ అవార్డును అందుకున్నారు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య 60 బిలియన్‌ డాలర్ల వాణిజ్యం జరుగుతోంది. యుఏఈ భారత్‌కు మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. అలాగే యుఏఈ పెట్రోలియం ఉత్పత్తుల్లో భారత్‌ నాలుగో అతిపెద్ద దిగుమతిదారు. భారతదేశం నుంచి దాదాపు 33 లక్షల మంది యుఏఈలో పని చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement