జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం | Two Terrorists Gunned Down in Jammu and Kashmir Kulgam | Sakshi
Sakshi News home page

జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

May 30 2020 10:45 AM | Updated on May 30 2020 10:50 AM

Two Terrorists Gunned Down in Jammu and Kashmir Kulgam - Sakshi

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌ కుల్గాం జిల్లాలోని వాన్‌పోరాలో శనివారం భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ సందర్బంగా జమ్మూ కాశ్మీర్ పోలీస్‌ ఇన్స్‌పెక్టర్ జనరల్ (కాశ్మీర్ జోన్) విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ‘వాన్‌పోరా ప్రాంతంలో ముష్కరులు ఉన్నట్లు మాకు సమాచారం అందింది. దాంతో ఆర్మీ, సీఆర్పీఎఫ్‌ బలగాలు సంయుక్తంగా నిర్బంధ తనిఖీలు నిర్వహించాయి. అనుమానిత ప్రాంతానికి వచ్చే సరికి ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఘటనాస్థలి నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. మిగతా ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి’ అని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement