పశ్చిమబెంగాల్లో ఓ గిరిజన యువతిని దుండుగులు కిడ్నాప్ చేసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
కోల్కతా: పశ్చిమబెంగాల్లో ఓ గిరిజన యువతిని దుండుగులు కిడ్నాప్ చేసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
శుక్రవారం రాత్రి బీర్బుం జిల్లాలోని తంతిపరలో ఓ వివాహం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా 6 నుంచి 8 మంది తనను కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడినట్టు బాధితురాలు ఫిర్యాదు చేసింది. నలుగురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్టు పోలీసు అధికారులు తెలిపారు.