ఆధార్‌ సీడింగ్‌తో ఇక ఒక్కటే పీఎఫ్‌ ఖాతా

There is only one PF account with Aadhaar Seeding - Sakshi

కోల్‌కతా: పీఎఫ్‌ ఖాతాతో ఆధార్‌ సీడింగ్‌ పూర్తయితే ఒక వ్యక్తికి ఒకటి కన్నా ఎక్కువగా ఉన్న ఖాతాలను తొలగించడం సులభమవుతుందని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ) తెలిపింది. ఆధార్, బ్యాంకు ఖాతాలతో అనుసంధానం వల్ల బహుళ పీఎఫ్‌ ఖాతాలను గుర్తించి తొలగించడానికి వీలవుతుందని అడిషనల్‌ సెంట్రల్‌ పీఎఫ్‌ కమిషనర్‌ సిన్హా శుక్రవారం తెలిపారు.

కోల్‌కతాలో పీఎఫ్‌ ఫండ్‌ నిర్వహణపై నిర్వహించిన సదస్సు సందర్భంగా స్థానిక పీఎఫ్‌ కమిషనర్‌ నవేందు రాయ్‌ మాట్లాడారు. సార్వత్రిక ఖాతా సంఖ్యను ఆధార్‌తో అనుసంధానం చేయడం వల్ల ఉద్యోగులు కొత్త సంస్థకు తమ పీఎఫ్‌ ఖాతాను బదిలీచేయనవసరం లేదని, అది ఆటోమేటిక్‌గా బదిలీ అవుతుందన్నారు.గడువు ముగియక ముందే ఖాతా నుంచి నగదు ఉపసంహరణకు స్వీయ ధ్రువీకరణ విధానాన్ని ప్రారంభించామని తెలిపారు.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top