అల్ ఖైదా అనుమానిత ఉగ్రవాది ఆసిఫ్ (41)ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
న్యూఢిల్లీ: అల్ ఖైదా అనుమానిత ఉగ్రవాది ఆసిఫ్ (41)ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ఉదయం పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. ఆసిఫ్ స్వస్థలం ఉత్తరప్రదేశ్లోని సంబల్ ప్రాంతం.
క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా దాడులు చేసేందుకు ఉగ్రవాదులు కట్రపన్నినట్టు నిఘా విభాగం హెచ్చరించడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఢిల్లీలో ఆసిఫ్తో పాటు మరో అనుమానిత ఉగ్రవాదిని అరెస్ట్ చేసినట్టు సమాచారం.