ముఖ్యమంత్రి రేసులో సుష్మాస్వరాజ్! | Sushma Swaraj in CM race! | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రి రేసులో సుష్మాస్వరాజ్!

Oct 19 2014 12:20 PM | Updated on Sep 2 2017 3:06 PM

సుష్మాస్వరాజ్

సుష్మాస్వరాజ్

హర్యానాలో బీజేపీకి పూర్తి మెజార్టీ వస్తుందని స్సష్టమవడంతో ముఖ్యమంత్రి స్థానానికి ఆ పార్టీలో పోటీ మొదలైంది.

న్యూఢిల్లీ/చంఢీఘర్: హర్యానాలో బీజేపీకి పూర్తి మెజార్టీ వస్తుందని స్సష్టమవడంతో  ముఖ్యమంత్రి స్థానానికి ఆ పార్టీలో పోటీ మొదలైంది.  హర్యానాలో బీజేపీ మొట్టమొదటిసారిగా ఆధికారాన్ని చేపట్టబోతోంది.  ఈ రాష్ట్రంలోని మొత్తం  90 శాసనసభ స్థానాలలో ఓట్లను లెక్కిస్తున్నారు.  బీజేపీ దాదాపు 52 స్థానాలలో ఆధిక్యతలో ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 46 స్థానాలు ఉంటే చాలు. మెజార్టీ స్థానాలను బీజేపీ ఒక్కటే గెలుచుకునే అవకాశం ఉంది.

ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి ఎవరన్న చర్చ మొదలైంది. అయితే ఈ పదవికి అభ్యర్థిని ఎంపిక చేసే ముందు అనేక అంశాలను పార్టీ పరిగణనలోకి తీసుకుంటుంది. ముఖ్యంగా కులానికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి బీజేపీ సీనియర్ నేత కెప్టెన్ అభిమన్యు పేరు ప్రధానంగా వినవస్తోంది. ఇంకా  కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్, ఇంద్రజిత్ సింగ్, క్రిషన్ పాల్, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు  రాంవిలాస్ శర్మ పేర్లు కూడా వినవస్తున్నాయి.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement