ప్రభుత్వ అధికారిని చెప్పుతో కొట్టిన  టిక్‌టాక్‌ స్టార్‌

Sonali Phogat Arrested Who Thrashed Official With Slippers in Hisar - Sakshi

చంఢీగడ్‌: టిక్‌టాక్ స్టార్‌, బీజేపీ నేత సోనాలి ఫోగట్‌ను బుధవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రభుత్వ అధికారిని అడ్డుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ అరెస్ట్‌ చోటు చేసుకుంది. ఈ నెల ప్రారంభంలో సోనాలి ఫోగట్‌ బాలాస్మంద్‌లోని ధాన్యం మార్కెట్‌ను స‌మీక్షించేందుకు వెళ్లారు. ఈ క్ర‌మంలో అక్క‌డున్న మార్కెట్ సెక్ర‌ట‌రీ సుల్తాన్‌సింగ్‌తో ఆమెకు వాదులాట జ‌రిగింది. దాంతో ఆగ్ర‌హంతో ఊగిపోయిన సోనాలి అత‌డిని చెప్పుతో కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలయ్యింది. ఈ క్రమంలో సదరు అధికారి దుర్భాష‌లాడుతూ, త‌న‌ను అవ‌మానించ‌డం వ‌ల్లే కొట్టాల్సి వ‌చ్చింద‌ని సోనాలి పేర్కొన్నారు. ఈ క్రమంలో సుల్తాన్‌ సింగ్‌ ఆమె మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాక  తానేమీ అన‌క‌ముందే సోనాలి త‌న‌పై దాడి చేసింద‌ని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో పోలీసులు బుధవారం సోనాలిని అరెస్ట్‌ చేశారు.

కాగా టిక్‌టాక్‌తో గుర్తింపు సంపాదించుకున్న సోనాలి ఫోగ‌ట్‌కు బీజేపీ గ‌తేడాది ఎన్నిక‌ల్లో హ‌ర్యానాలోని ఆదంపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టికెట్ ఇచ్చింది. ఆమె గెలుపు త‌థ్య‌మ‌నుకున్న‌ప్ప‌టికీ అందరి అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ ఓట‌మిపాలైంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top