మంత్రిపైకి షూ విసిరాడు.. | Shoe Thrown At Punjab Minister Bikram Singh Majithia Inside Assembly | Sakshi
Sakshi News home page

మంత్రిపైకి షూ విసిరాడు..

Sep 14 2016 12:09 PM | Updated on Sep 4 2017 1:29 PM

మంత్రిపైకి షూ విసిరాడు..

మంత్రిపైకి షూ విసిరాడు..

మినిస్టర్ బిక్రమ్ సింగ్ మజీతియా పైకి బుధవారం అసెంబ్లీలో 'షూ' విసరడం కలకలం రేపింది.

న్యూఢిల్లీః పంజాబ్ లో రాజకీయం రసవత్తరంగా మారింది. మినిస్టర్ బిక్రమ్ సింగ్ మజీతియా పైకి బుధవారం అసెంబ్లీలో 'షూ' విసరడం కలకలం రేపింది. తర్లోచన్ సూంధ్ అనే కాంగ్రెస్ చట్ట సభ్యుడు తమ పార్టీ నిరసనల సందర్భంలో సభలో తన షూ విప్పి మంత్రిపైకి విసరడం పంజాబ్ అసెంబ్లీలోనే కొత్త పోకడలకు దారి తీసింది.

రాష్ట్రంలోని అకాలీదళ్ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సభ్యులు అవిశ్వాస తీర్మానంపై చర్చకు డిమాండ్ చేస్తున్న సందర్భంలో సూంధ్.. మంత్రిపైకి 'షూ' విసరడం ప్రస్తుతం పంజాబ్ అసెంబ్లీలో ఉద్రిక్తంగా మారింది. వాయిస్ ఓటు ద్వారా వారి డిమాండ్ ను తిరస్కరించినట్లు ప్రకటించడంతో సుమారు 22 మంది సభ్యులు సోమవారంనుంచీ అసెంబ్లీ భవనాన్ని విడిచి వెళ్ళలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement