బుద్గాం జిల్లాలో రీపోలింగ్‌ | Re-poll begins in Kashmir's Budgam | Sakshi
Sakshi News home page

బుద్గాం జిల్లాలో రీపోలింగ్‌

Apr 13 2017 11:12 AM | Updated on Sep 5 2017 8:41 AM

శ్రీనగర్‌ లోక్‌సభ స్థానానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో పోలింగ్‌ అత్యల్పంగా నమోదైన బుద్గాం జిల్లాలోని 38 కేంద్రాల్లో గురువారం రీ పోలింగ్‌ జరుగుతోంది.

జమ్ముకశ్మీర్‌: శ్రీనగర్‌ లోక్‌సభ స్థానానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో పోలింగ్‌ అత్యల్పంగా నమోదైన బుద్గాం జిల్లాలోని 38 కేంద్రాల్లో గురువారం రీ పోలింగ్‌ జరుగుతోంది. గతంలో పోలింగ్‌ జరుగుతున్న సమయంలో అల్లరి మూక దాడులు చేసిన నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీనగర్‌ లోక్‌సభ ఎన్నికల్లో జరిగిన గొడవల్లో పోలీసులు కాల్పుల్లో 8 మంది నిరసనకారులు మృతిచెందిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement