రాజ్యసభ ఎన్నికలు మరిన్ని రోజులు వాయిదా | Rajya Sabha elections postponed over coronavirus lockdown | Sakshi
Sakshi News home page

రాజ్యసభ ఎన్నికలు మరిన్ని రోజులు వాయిదా

Apr 4 2020 6:23 AM | Updated on Apr 4 2020 6:23 AM

Rajya Sabha elections postponed over coronavirus lockdown - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఏప్రిల్‌ 9తో పదవీ కాలం పూర్తయిన రాజ్యసభ సభ్యుల స్థానాలకు నిర్వహించాల్సిన ద్వైవార్షిక ఎన్నికలను కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 24న వాయిదావేస్తూ ప్రకటన జారీచేసిన సంగతి తెలిసిందే. దీనిపై మరోసారి సమీక్ష జరిపి ఇంకా కొన్ని రోజులు వాయిదా వేస్తున్నట్టు శుక్రవారం మరో ప్రకటన చేసింది. ఎన్నికల నిర్వహణ తేదీని తరువాత ప్రకటిస్తామని స్పష్టం చేసింది. మొత్తం 55 స్థానాలకు గాను 37 స్థానాల్లో పోటీ లేకుండా ఎన్నిక పూర్తయింది. కాగా మరో 18 స్థానాల్లో ఎన్నిక జరగాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement