మహిళపై దాడి చేసి ఏడుచోట్ల అసభ్య టాటూలు | Sakshi
Sakshi News home page

మహిళపై దాడి చేసి ఏడుచోట్ల అసభ్య టాటూలు

Published Mon, Jun 27 2016 2:08 PM

మహిళపై దాడి చేసి ఏడుచోట్ల అసభ్య టాటూలు - Sakshi

జైపూర్: రాజస్థాన్లో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళపై ఘోరంగా దాడి చేసి ఆమెను బాగా కొట్టిపడేశారు. అంతటితో ఆగకుండా ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లగానే శరీరం నిండా ఏడు చోట్ల పచ్చబొట్లు అసభ్యకరంగా పొడిచారు. చెప్పకూడని చోట్లలో ఆమెకు పచ్చబొట్లు వేశారు. నుదురు భాగంలో ' మా నాన్న ఒక దొంగ' అంటూ పచ్చబొట్టేశారు.

ఈ సంఘటన చూసి ఖిన్నులైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు ప్రకారం ఈ దారుణానికి పాల్పడింది ఆ మహిళ అత్తింటివాళ్లేనని తెలుస్తోంది. కట్నంగా తీసుకొస్తానని చెప్పిన రూ.51 వేలు చెల్లించలేదనే అక్కసుతో ఆమెను దారుణంగా కొట్టి వారు ఈ పనిచేసినట్లు తెలుస్తోంది. గత నెలలో కూడా ఒకసారి తమ కూతురుకి మత్తుమందు ఇచ్చి గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి చిత్ర హింసలు పెట్టినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement