చిదంబరాన్ని కలిసిన రాహుల్, ప్రియాంక

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రాలు బుధవారం ఉదయం మాజీ ఆర్ధిక మంత్రి పి. చిదంబరంను కలిశారు. చిదంబరం ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. గత సోమవారం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, మనీష్ తివారీలు ఆయనను కలిశారు. కాగా, అధికారంలో ఉన్నప్పుడు ముడుపుల కుంభకోణం, మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారంటూ అభియోగాలు వచ్చిన నేపథ్యంలో సీబీఐ ఆగస్టు 21న చిదంబరంను అరెస్ట్ చేసింది. అనంతరం సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసినా ఈడీ కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు. అప్పటి నుంచి ఆయన తీహార్ జైలులో విచారణ ఖైదీగా ఉంటున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి