‘వయసైపోయింది.. ఆయన మాటలు పట్టించుకోకండి’

Rabri Devi Said Mulayam Singh Yadav Statements Bear No Relevance - Sakshi

పట్నా : నరేంద్రమోదీ మరోసారి దేశ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నానని సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, రాజకీయ కురువృద్ధుడు ములాయం సింగ్‌ యాదవ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రతిపక్షాలకు షాక్‌ ఇచ్చిన ఈ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజా ములాయం వ్యాఖ్యలపై బిహార్‌ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ సతీమణి రబ్రీదేవి స్పందించారు. ‘ఆయనకు వయసైపోయింది. ఎప్పుడు ఏం మాట్లాడాలన్నది గుర్తుకురాదు. ఆయన మాటలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని రబ్రీదేవి ముక్తాయించారు.

ములాయం వ్యాఖ్యల పట్ల సమాజ్‌వాదీ పార్టీలోనూ తీవ్ర అసంతృప్తి చెలరేగుతోంది. ఇదిలా ఉండగా లోక్‌సభలో మోదీకి మద్దతుగా ములాయం మాట్లాడటంతో.. బీజేపీ కార్యకర్తలు ఆయనకు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top