షాకింగ్‌ : టాయిలెట్‌లో కెమెరా అమర్చారు..

Pune Woman Finds Hidden Camera In Cafe Toilet Became Viral - Sakshi

పుణే : పుణేలోని ఒక కేఫ్‌లో టాయిలెట్ లోపల దాచిన కెమెరాను ఒక మహిళ ఫోటోలు తీసి సోషల్‌మీడియాలో షేర్‌ చేయడం వైరల్‌గా మారింది. అంతేగాక సదరు మహిళ తాను కెమెరాను ఎలా కనుగొన్నది ఇన్‌స్టాగ్రామ్‌లో స్క్రీన్‌షాట్ల రూపంలో వివరించింది. ఈ ఘటనపై స్పందించిన పూణే పోలీసులు స్పందిస్తూ..  ఈ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం పంపించామని, కేఫ్‌పై తగిన చర్యలు తీసుకునే విధంగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.

వివరాల్లోకి వెళితే.. మూడు రోజుల క్రితం పూణేలోని హింజావాడి ఏరియాలోని కేఫ్‌ బిహైవ్‌కు ఓ మహిళ కాఫీ తాగేందుకు వచ్చింది. రెస్ట్‌ రూమ్‌కు అని వెళ్లిన సదరు మహిళ టాయిలెట్‌లో కెమెరా ఉన్నట్లు గుర్తించి వాటిని ఫోటోలు తీసుకుంది. ఇదే విషయాన్ని మేనేజ్‌మెంట్‌ దృష్టికి తీసుకురాగా ఆమెను 10 నిమిషాలు బయటికి పంపించి కెమెరాను రహస్యంగా తొలగించారు. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచేందుకు తనకు లంచం కూడా ఇవ్వబోయారని సదరు మహిళ పేర్కొన్నారు. అయితే ఈ వ్యవహారం మొత్తాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. దీంతో పలువురు నెటిజన్లు స్పందిస్తూ .. ఇలాంటి అసభ్యకరమైన పనులు చేస్తున్న కేఫ్‌ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని మండిపడుతున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top