వచ్చే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి నితీశ్‌..! | Project Nitish as PM face of secular front for 2019: JD(U) | Sakshi
Sakshi News home page

వచ్చే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి నితీశ్‌..!

Mar 29 2017 8:52 AM | Updated on Sep 17 2018 7:44 PM

వచ్చే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి నితీశ్‌..! - Sakshi

వచ్చే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి నితీశ్‌..!

బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ను 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో లౌకిక కూటమి తరుపున ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దించేందుకు జేడీయూ సిద్ధమైంది.

పట్నా: బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ను 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో లౌకిక కూటమి తరుపున ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దించేందుకు జేడీయూ సిద్ధమైంది. ఇప్పటికే ఆయనను ప్రధానిగా ప్రమోట్‌ చేస్తూ జేడీయూ అధికారికంగా ముందుకెళుతోంది. దేశంలో లౌకిక శక్తులన్నీ ఏకమై నితీశ్‌ నాయకత్వంలో ఎన్నికల్లోకి వెళ్లాలని, ఆయనకు ప్రధాని బాధ్యతలు కట్టబెట్టాలని జేడీయూ కోరింది.

ప్రగతిశీల దూరదృష్టి కలిగిన మంచి పరిపాలకుడు నితీశ్‌ అని, ఆయనను లౌకిక శక్తుల నాయకుడిగా ఇప్పటికే ఏకగ్రీవంగా తాము అంగీకరించామని జేడీయూ అధికారిక ప్రతినిధి భారతీ మెహతా చెప్పారు. ముఖ్యమంత్రిగా నితీశ్‌ మహిళలను శక్తిమంతులుగా మార్చే చర్యలు ఘనంగా చేపట్టారని, స్థానిక సంస్థల్లో వారికి రిజర్వేషన్లు, బాలికలకు సైకిళ్ల పంపిణీ, మద్యపానం నిషేధంవంటి పలు చర్యలు తీసుకున్నారని అన్నారు. తమ రాష్ట్రంలో అభివృద్ధికోసం ప్రధానంగా ఏడు అంశాలను ఎంచుకొని ముందుకెళుతున్నారని, ఆయన ఓ విజనరీ నాయకుడు అని కొనియాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement