ఇకనుంచి ఆర్టీఐ నుంచి ఏమైనా సమాచారం కావాలంటే ఆయా శాఖల్ని నేరుగా సంప్రదించాల్సిన అవసరం లేదు.
న్యూఢిల్లీ: ఇకనుంచి ఆర్టీఐ నుంచి ఏమైనా సమాచారం కావాలంటే ఆయా శాఖల్ని నేరుగా సంప్రదించాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే.. మీరడిగిన సమాచారం తపాలాశాఖ ద్వారా అందుతుంది. దీనికి సంబంధించి ఆన్‌లైన్ పోర్టల్‌ను కేంద్రమంత్రి నారాయణ స్వామి బుధవారం ఆరంభించారు. దీనికి గాను కొంత ఫీజును ఆన్‌లైన్‌లోనే చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఆన్‌లైన్ లో ఆప్లై చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు మంత్రి తెలిపారు. ఈ అవకాశాన్ని అన్ని ప్రభుత్వ విభాగాల్లో అందుబాటులో ఉంటుందన్నారు. దీని అభివృద్ధికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.