పీఎస్‌యూల విక్రయంపై పీఎంఓ కీలక భేటీ | Sakshi
Sakshi News home page

పీఎస్‌యూల విక్రయంపై పీఎంఓ కీలక భేటీ

Published Wed, Feb 6 2019 2:26 PM

PMO Holds Meeting To Speed Up Strategic Sale Of PSUs - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ సంస్ధల (పీఎస్‌యూ) వ్యూహాత్మక విక్రయ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) బుధవారం కీలక సమావేశం నిర్వహించింది. నీతి ఆయోగ్‌ సూచించిన పీఎస్‌యూల విక్రయంలో సత్వరమే ముందుకెళ్లే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై ఈ భేటీలో చర్చించారు. ఎయిర్‌ ఇండియా, డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌, బీఈఎంఎల్‌, స్కూటర్క్‌ ఇండియా వంటి 35 పీఎస్‌యూలను విక్రయించాల్సిన జాబితాలో నీతి ఆయోగ్‌ పొందుపరిచింది.

నిర్ధిష్ట పీఎస్‌యూ విక్రయాల్లో కొన్ని సంస్థల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న క్రమంలో వీటిని ఎదుర్కొంటూ అవరోధాలను అధిగమించి, మొత్త విక్రయ ప్రక్రియను వేగిరపరిచేందుకు పీఎంఓ ప్రయత్నిస్తోందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు మలిదశలో బాగంగా ప్రభుత్వ రంగ సంస్థలు హిందుస్ధాన్‌ ఫ్లోరోకార్బన్‌, హిందుస్ధాన్‌ న్యూస్‌ప్రింట్‌, హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌, సెంట్రల్‌ ఎలక్ర్టానిక్స్‌ వంటి పలు పీఎస్‌యూల విక్రయ ప్రకియను చేపట్టనున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement