నాటి వీరులకు ఘన నివాళి | Sakshi
Sakshi News home page

నాటి వీరులకు ఘన నివాళి

Published Sun, Dec 13 2015 11:48 AM

నాటి వీరులకు ఘన నివాళి - Sakshi

న్యూఢిల్లీ: పార్లమెంటుపై 2001, డిసెంబర్ 13న పాకిస్థాన్ ముష్కరులు జరిపిన దాడిని ధీటుగా ఎదుర్కొని అమరవీరులైన వారికి దేశం ఆదివారం ఘన నివాళి అర్పించింది.

ఆదివారం పార్లమెంటు భవన్ వద్ద అమరవీరుల చిత్రపటాలకు ప్రధాని నరేంద్రమోదీ, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహజన్, రాజ్యసభ స్పీకర్ కురియన్ తోపాటు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, గులాంనబీ అజాద్, ఇతర బీజేపీ, కాంగ్రెస్ నేతలు అమరుల చిత్రపటాలపై పూలు జల్లి నివాళులు అర్పించారు. బీజేపీ నేత అద్వానీ కూడా నివాళులు అర్పించినవారిలో ఉన్నారు. ఈ సందర్బంగా నాటి మృతవీరుల కుటుంబాల సభ్యులు అద్వానీని మర్యాదపూర్వకంగా కలిశారు.


 

Advertisement
 
Advertisement
 
Advertisement