రిపబ్లిక్‌ డేపై గూగుల్ స్పెషల్ డూడుల్‌ | on Republic Day, BSF camel contingent march on Google doodle | Sakshi
Sakshi News home page

రిపబ్లిక్‌ డేపై గూగుల్ స్పెషల్ డూడుల్‌

Jan 26 2016 8:53 AM | Updated on Sep 3 2017 4:21 PM

రిపబ్లిక్‌ డేపై గూగుల్ స్పెషల్ డూడుల్‌

రిపబ్లిక్‌ డేపై గూగుల్ స్పెషల్ డూడుల్‌

భారత 67వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక డూడుల్‌తో గూగుల్‌ తనదైనశైలిలో శుభాకాంక్షలు తెలిపింది.

న్యూఢిల్లీ: భారత 67వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక డూడుల్‌తో గూగుల్‌ తనదైనశైలిలో శుభాకాంక్షలు తెలిపింది. సరిహద్దు భద్రతా దళానికి (బీఎస్‌ఎఫ్) చెందిన ఒంటెల దళం కవాత్తును తన సెర్చ్‌ పేజీలో డూడుల్‌గా ప్రచురించింది. ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో జరుగుతున్న గణతంత్ర వేడుకలను తలపించేలా.. అందంగా తీర్చిదిద్దిన ఒంటెలు, వాటిపై కూర్చుని మార్షియల్ సంగీతాన్ని అందిస్తున్న బ్యాండ్‌మేళాతో కూడిన డూడుల్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ డూడుల్‌లోని ఆరు ఒంటెలపై కప్పిన బంగారురంగు జరీవస్త్రంపై గూగుల్ అని ఆంగ్ల అక్షరాలు ఎరుపు రంగంలో రాసి ఉన్నాయి. దేశంలో బీఎస్‌ఎఫ్‌కు మాత్రమే అందంగా తీర్చిదిద్దిన ఒంటెల దళం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement