సాహోరే బామ్మలు.. మీ డాన్స్‌ సూపరు!

Old Women Dancing at School Reunion Watch Viral Video - Sakshi

మనిషి జీవితంలో అత్యంత మధురమైన దశ బాల్యం. చిన్ననాటి సంగతులు గుర్తుకు వస్తే ఎంత పెద్దవారైనా పిల్లలైపోతారు. బడిలో చదువులు, చిన్ననాటి అల్లర్లు ఏనాటికి మర్చిపోలేము. అందుకే కాబోలు ఈ బామ్మలు కూడా తమ బాల్యమిత్రులను చూడగానే హుషారుగా నృత్యాలు చేశారు. చిన్ననాటి సంగతులను తలుచుకుని ఎంతో మురిసిపోయారు. కర్ణాటకలోని మంగళూరులో ఇటీవల జరిగిన పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో కొంత మంది బామ్మలు ఉత్సాహంగా గడిపిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. స్కూల్‌ రోజులను గుర్తుచేసుకుని వారంతా చిన్నపిల్లల్లా మారిపోయారు. ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ సరదాగా గడిపారు. 70 ఏళ్లు పైబడిన వయసులోనూ పాటలకు ఉత్సాహంగా డాన్సులు చేసి ఔరా అనిపించారు.

ఈ వీడియోను నాంది ఫౌండేషన్‌, అరకు కాఫీ సీఈవో మనోజ్‌ కుమార్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఆడుతూ పాడుతూ ఆనందంగా గడిపిన బామ్మలను చూసిన వారంతా వారిని అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. 70 ఏళ్ల వయసు వచ్చాక తాము కూడా ఇలాగే గడుపుతామని కొంతమంది అంటే.. తమ చిన్ననాటి స్నేహితులను కలిసినప్పుడు ఇలాగే సరదాగా ఉంటామని మరికొందరు వెల్లడించారు. మనిషి జీవితంలో సంతోషానికి సాటి ఏదీ లేదని చాలా మంది వ్యాఖ్యానించారు. (చదవండి: వీళ్లు పిల్లలు కాదు పిడుగులే..!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top