రాష్ట్రపతి రేసులో 92 మంది! | Nomination papers of more than 90 presidential candidates rejected | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి రేసులో 92 మంది!

Jun 29 2017 3:41 PM | Updated on Sep 5 2017 2:46 PM

రాష్ట్రపతి రేసులో 92 మంది!

రాష్ట్రపతి రేసులో 92 మంది!

భారత రాష్ట్రపతి పదవి కోసం ఎంతమంది బరిలోకి దిగారో తెలుసా.. 90మందికిపైగానే.

న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి పదవి కోసం ఎంతమంది బరిలోకి దిగారో తెలుసా.. 90మందికిపైగానే. అదేమిటీ ఎన్డీయే తరుపున రామ్‌నాథ్‌ కోవింద్‌, కాంగ్రెస్‌ పార్టీ తరుపున మీరా కుమార్‌ మాత్రమేగా పోటిలోకి దిగిందని ఆశ్చర్యపోతున్నారా.. ఇది నిజమే..మొత్తం 90మందికి పైగానే రాష్ట్రపతి పదవి కోసం నామినేషన్‌ పత్రాలు సమర్పించారు.

అయితే, వారిలో 90మందికి పైగా నామినేషన్‌ పేపర్లను ఎన్నికల కమిషన్‌ తిరస్కరించింది. వాటికి సరైన ఆధారాలు, రుజువు పత్రాలు సమర్పించలేదనే కారణంతోపాటు చట్టప్రతినిధుల మద్దతులేదనే కారణంతో వాటిని రిజెక్ట్‌ చేసింది. చివరకు రామ్‌నాథ్‌ కోవింద్‌, మీరా కుమార్‌ దాఖలు చేసిన నామినేషన్‌ పత్రాలు మాత్రమే విలువైనవిగా, అన్ని రకాలుగా అర్హతలు గలవిగా ఈసీ గుర్తించింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement