విశ్వాస పరీక్ష నెగ్గిన నితీశ్ | nitesh won confidence vote | Sakshi
Sakshi News home page

విశ్వాస పరీక్ష నెగ్గిన నితీశ్

Mar 12 2015 3:32 AM | Updated on Jul 18 2019 2:17 PM

విశ్వాస పరీక్ష నెగ్గిన నితీశ్ - Sakshi

విశ్వాస పరీక్ష నెగ్గిన నితీశ్

బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీశ్ కుమార్ బుధవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్షను మిత్రపక్షాలైన ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఐ సాయంతో గట్టెక్కారు.

 పట్నా: బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీశ్ కుమార్ బుధవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్షను మిత్రపక్షాలైన ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఐ సాయంతో గట్టెక్కారు. ఆయన ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 140 ఓట్లు పడగా వ్యతిరేకంగా ఒక్క ఓటూ పడలేదు. అసెంబ్లీ బలం 243 సీట్లు కాగా, పది ఖాళీగా ఉండడంతో ప్రస్తుతం 233 మంది సభ్యులు ఉన్నారు. తీర్మానం తొలుత మూజువాణి ఓటుతో నెగ్గింది. అయితే ప్రభుత్వం పట్టబట్టడంతో డివిజన్ ఓటింగ్ జరిపారు. మాజీ సీఎం జితన్‌రాం మాంఝీ మినహా మిగిలిన జేడీయూ అసమ్మతి ఎమ్మెల్యేలు అనర్హత భయంతో పార్టీ విప్‌కు కట్టుబడి సర్కారుకు మద్దతు పలికారు. ఏ పార్టీకీ చెందని ఎమ్మెల్యే అయిన తనకు విప్ ఎలా వర్తిస్తుందని మాంఝీ ప్రశ్నించి, సభ నుంచి వెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement