తల్లి ఆశీర్వాదం తీసుకున్న మోడీ | Narendra Modi visits mother's home, seeks blessings on birthday | Sakshi
Sakshi News home page

తల్లి ఆశీర్వాదం తీసుకున్న మోడీ

Sep 17 2014 9:37 AM | Updated on Apr 3 2019 4:08 PM

తల్లి ఆశీర్వాదం తీసుకున్న మోడీ - Sakshi

తల్లి ఆశీర్వాదం తీసుకున్న మోడీ

దేశానికి ప్రధాని అయినా ....అమ్మకు మాత్రం కొడుకే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన పుట్టిన రోజు సందర్భంగా బుధవారం ఉదయం తల్లి హీరాబెన్ ఆశీర్వాదం తీసుకున్నారు.

గాంధీనగర్ : దేశానికి ప్రధాని అయినా ....అమ్మకు మాత్రం కొడుకే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన పుట్టిన రోజు సందర్భంగా బుధవారం ఉదయం తల్లి హీరాబెన్ ఆశీర్వాదం తీసుకున్నారు. మోడీ నేడు 64వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన గాంధీనగర్లోని తల్లిని కలిసి కలిసి ఆశీస్సులు అందుకున్నారు.  అనంతరం ఆమె కుమారుడికి మిఠాయి తినిపించారు. గతంలో కూడా మోడీ  చాలాసార్లు తన పుట్టినరోజున స్వయంగా వచ్చి తల్లి ఆశీర్వాదాలు తీసుకునేవారు.

పుట్టిన రోజు సందర్భంగా మోడీకి బీజేపీ అగ్రనాయకులు, నేతలు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్.... ఫోన్లో మోడీ శుభాకాంక్షలు తెలియచేశారు. మరోవైపు తన జన్మదిన వేడుకలను జరపవద్దని మోడీ ఇప్పటికే పార్టీ కార్యకర్తలు, మిత్రులు, ఇతర నేతలకు విజ్ఞప్తి చేశారు. పుట్టిన రోజు వేడుకలకు వెచ్చించే సమయాన్ని జమ్మూ కాశ్మీర్‌ వరద బాధితులను ఆదుకోవడానికి కేటాయించాలని ఆయన కోరిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement