సమాజ్ వాదీ పార్టీనేత ములాయం సింగ్ యాదవ్ మనవడు తేజ్ ప్రతాప్ యాదవ్ తిలక్ వివాహ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం హాజరు కానున్నారు.
సైఫై: సమాజ్ వాదీ పార్టీనేత ములాయం సింగ్ యాదవ్ మనవడు తేజ్ ప్రతాప్ యాదవ్ తిలక్ వివాహ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం హాజరు కానున్నారు. ములాయం సొంత గ్రామమైన సైఫైలో పెళ్లి వేడుక జరుగుతోంది. జనతాదళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రాజ్యలక్ష్మి, తేజ్ ప్రతాప్ యాదవ్ పెళ్ళి ఫిబ్రవరి 26 న ఢిల్లీలో జరగనున్న విషయం తెలిసిందే.
ఈ కార్యక్రమానికి దేశంలోని పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు హాజరువుతారని సమాచారం. ముఖ్యంగా ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు, జేడీఎస్ చీఫ్ దేవెగౌడ, ఉత్తర ప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్ తదితరులు హాజరు కానున్నారు. మరోవైపు ప్రధాని మోదీ రాక సందర్భంగా అన్ని భద్రతా ఏర్పాట్లు తీసుకున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.