breaking news
tilak ceremony
-
కరెన్సీ తిప్పలు, వివాహ వేడుకలో విషాదం
బలియా: వివాహ, ఇతర శుభకార్యక్రమాలు పెట్టుకున్నవారు పెద్ద నోట్ల రద్దు వల్ల ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుల దగ్గరకు వెళ్లి పెళ్లి కార్డు చూపిస్తూ పెద్ద నోట్లు మార్చి ఇవ్వాలని, ఖాతాలోని డబ్బు ఇవ్వాలంటూ కోరుతున్నారు. కుమార్తె పెళ్లి వేడుకకు డబ్బులు దొరకలేదనే మనస్తాపంతో ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యక్తి మరణించాడు. బరేలి జిల్లా సహత్వార్ నగర్ పంచాయతీకి చెందిన సురేష్ సోనార్ కుమార్తె సుమన్‌కు వివాహం నిశ్చయమైంది. బుధవారం ఆమెకు తిలక ధారణ కార్యక్రమం నిర్వహించాల్సి వుంది. మంగళవారం సోనార్ తన వద్ద ఉన్న 500, 1000 రూపాయల నోట్లను మార్చుకునేందుకు ఎస్బీఐ బ్రాంచ్‌కు వెళ్లాడు. గంటలకొద్దీ క్యూలో నిల్చుని నిరాశతో ఇంటికి తిరిగి వచ్చాడు. శుభకార్యానికి తగినంత డబ్బు అందుబాటులో లేనందుకు సోనార్ బాధపడ్డాడని, ఆవేదన చెందిన ఆయన నిన్న రాత్రి గుండెపోటుతో మరణించాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని బలియా ఎస్పీ వైభవ్ కృష్ణ చెప్పారు. -
ములాయం మనవడి వివాహ కార్యక్రమానికి ప్రధాని
సైఫై: సమాజ్ వాదీ పార్టీనేత ములాయం సింగ్ యాదవ్ మనవడు తేజ్ ప్రతాప్ యాదవ్ తిలక్ వివాహ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం హాజరు కానున్నారు. ములాయం సొంత గ్రామమైన సైఫైలో పెళ్లి వేడుక జరుగుతోంది. జనతాదళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రాజ్యలక్ష్మి, తేజ్ ప్రతాప్ యాదవ్ పెళ్ళి ఫిబ్రవరి 26 న ఢిల్లీలో జరగనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి దేశంలోని పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు హాజరువుతారని సమాచారం. ముఖ్యంగా ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు, జేడీఎస్ చీఫ్ దేవెగౌడ, ఉత్తర ప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్ తదితరులు హాజరు కానున్నారు. మరోవైపు ప్రధాని మోదీ రాక సందర్భంగా అన్ని భద్రతా ఏర్పాట్లు తీసుకున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.