కరెన్సీ తిప్పలు, వివాహ వేడుకలో విషాదం | Demonetisation: Bride-to-bes father dies of heart attack | Sakshi
Sakshi News home page

కరెన్సీ తిప్పలు, వివాహ వేడుకలో విషాదం

Nov 16 2016 6:15 PM | Updated on Sep 27 2018 9:08 PM

కరెన్సీ తిప్పలు, వివాహ వేడుకలో విషాదం - Sakshi

కరెన్సీ తిప్పలు, వివాహ వేడుకలో విషాదం

కుమార్తె పెళ్లి వేడుకకు డబ్బులు దొరకలేదనే మనస్తాపంతో ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యక్తి మరణించాడు.

బలియా: వివాహ, ఇతర శుభకార్యక్రమాలు పెట్టుకున్నవారు పెద్ద నోట్ల రద్దు వల్ల ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుల దగ్గరకు వెళ్లి పెళ్లి కార్డు చూపిస్తూ పెద్ద నోట్లు మార్చి ఇవ్వాలని, ఖాతాలోని డబ్బు ఇవ్వాలంటూ కోరుతున్నారు. కుమార్తె పెళ్లి వేడుకకు డబ్బులు దొరకలేదనే మనస్తాపంతో ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యక్తి మరణించాడు.

బరేలి జిల్లా సహత్వార్‌ నగర్‌ పంచాయతీకి చెందిన సురేష్‌ సోనార్‌ కుమార్తె సుమన్‌కు వివాహం నిశ్చయమైంది. బుధవారం ఆమెకు తిలక ధారణ కార్యక్రమం నిర్వహించాల్సి వుంది. మంగళవారం సోనార్‌ తన వద్ద ఉన్న 500, 1000 రూపాయల నోట్లను మార్చుకునేందుకు ఎస్‌బీఐ బ్రాంచ్‌కు వెళ్లాడు. గంటలకొద్దీ క్యూలో నిల్చుని నిరాశతో ఇంటికి తిరిగి వచ్చాడు. శుభకార్యానికి తగినంత డబ్బు అందుబాటులో లేనందుకు సోనార్‌ బాధపడ్డాడని, ఆవేదన చెందిన ఆయన నిన్న రాత్రి గుండెపోటుతో మరణించాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని బలియా ఎస్పీ వైభవ్‌ కృష్ణ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement