ఈ చిన్నోడి వయసు 8.. కానీ

Meet 8-yr-old Boy From Chennai who can Read and Write over 106 Languages - Sakshi

సాక్షి, చెన్నై: ఈ చెన్నై చిన్నోడు గురించి ఆసక్తికరమైన విషయాలు వింటోంటే..పిట్టకొంచెం కూత ఘనం అనిపించకమానదు. ఎనిమిది సంవత్సరాల వయసులోనే బహుభాషా కోవిదుడుగా ఘనత కెక్కాడు. అదీ కేవలం ఒక్క ఏడాదిలో ఈ క్రెడిట్‌ దక్కించుకోవడం విశేషం.

చెన్నైకి చెందిన ఈ అబ్బాయి పేరు నియాల్‌ తోగులువ. చిన్నప్పటినుంచీ తనకు తెలియకుండానే భాష మీద అభిమానం  ఉన్నా..గత ఏడాది నుంచి అది మరింత పెరిగందంటాడు నియాల్‌.  ఇంటర్నెట్ సహాయంతో ముఖ్యంగా యుట్యూబ్  ఆధారంగా ఈ ప్రావీణ్యం సంపాదించానని తెలిపాడు.

అలా ఒక భాష తరువాత ఒక  భాషపై ఆసక్తిని పెంచుకున్నాడట నియాల్‌. తన ప్రత్యేకమైన ప్రతిభతో ఏకంగా 106 భాషలను నేర్చుకున్నాడు. 10 భాషల్లో అనర్గళంగా మాట్లాడుతాడు. అంతేకాదు మరో అయిదు భాషల్లో ఈ ప్రావీణ్యం సంపాదించే పనిలో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. అంతేకాదు ఇంటర్నెట్‌ ఫోనెటిక్‌ ఆల్ఫాబెట్‌ను కూడా ఔపోసన పట్టేశాడు (యూనివర‍్సల్‌గా ఏ పదాన్ని ఎలా ఉచ్చరించాలో తెలుసుకోవడం).

నియాల్‌ ప్రతిభపై తండ్రి శంకర్‌నారాయణన్‌ మాట్లాడుతూ ఒక్క ఏడాదిలో ఇదంతా నేర్చుకున్నాడని తెలిపారు. ఇది తమ కుటుంబానికి ఎంతో సంతోషాన్నిచ్చిందంటూ పుత్రోత్సాహంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top