‘మోదీ విష్ణుమూర్తి 11వ అవతారం’ | Maharashtra BJP Leader Said PM Modi Is 11th Avatar Of Lord Vishnu | Sakshi
Sakshi News home page

‘మోదీ విష్ణుమూర్తి 11వ అవతారం’

Oct 13 2018 9:12 AM | Updated on Mar 29 2019 9:07 PM

Maharashtra BJP Leader Said PM Modi Is 11th Avatar Of Lord Vishnu - Sakshi

ప్రధాని నరేంద్ర మోదీ (ఫైల్‌ ఫోటో)

ముంబై : మహారాష్ట్ర బీజేపీ నాయకులు ప్రధాని నరేంద్ర మోదీని విష్ణుమూర్తి పదకొండో అవతారంగా పేర్కొంటూ చేసిన ట్వీట్‌పై వివాదం చేలరేగుతుంది. మహారాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి అవధూత్‌ వాఘ్‌ ‘మన మాన్య ప్రధాన మంత్రి నరేంద్ర మోదీజీ విష్ణు మూర్తి 11వ అవతారం’ అంటూ ట్వీట్‌ చేశారు. అయితే వాఘ్‌ చేసిన ట్వీట్‌ వివాదాస్పదంగా మారింది.

బీజేపీ నాయకులు దేవతలను అవమానిస్తున్నారంటూ కాంగ్రెస్‌ నాయకులు మండి పడుతున్నారు. ఇలాంటి కామెంట్‌లు బీజేపీ చౌకబారు రాజకీయాలకు ప్రతీకగా వారు ఆరోపిస్తున్నారు. వాఘ్‌ ఇంజనీరింగ్‌ గ్రాడ్యూయేట్‌ అని చెప్పుకుంటూ ఇలాంటి మాటలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆయన ఇంజనీరింగ్‌ సర్టిఫికెట్లు సరైనవో కావో చెక్‌ చేసుకోవాలంటూ కాంగ్రెస్‌ నాయకులు కామెంట్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement