
హరియాణ : ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు తమను మోసం చేశారంటూ హరియాణాలో రోజువారీ కూలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ర్యాలీలో పాల్గొంటే డబ్బులతో పాటు భోజనం పెడతామంటూ నమ్మించి...ర్యాలీ అయ్యాక ఉత్తి చేతులు చూపించారని వారు వాపోతున్నారు. హరియాణలోని హిసార్‌లో ఆదివారం జరిగిన ‘హరియాణా బచావత్’ ర్యాలీలో పాల్గొనాలని కొంత మంది ఆప్ నేతలు తమని తీసుకెళ్లారని, ర్యాలీలో పాల్గొన్నందకు ఒక్కొక్కరికి రూ.350 చొప్పున ఇచ్చి, భోజనం కూడా పెడతామన్నారని కూలీలు తెలిపారు. అయితే ర్యాలీ అయిపోయాక తమను ఎవరు పట్టించుకోలేదని, డబ్బులు కూడా ఇవ్వకుండా వెళ్లిపోయారంటూ ఆప్ నేతలపై కార్మికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆదివారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హరియాణలో ఎన్నికల ర్యాలీలో పాల్గోన్న విషయం తెలిసిందే.