నెహ్రూపై నడ్డా ఫైర్‌

JP Nadda Slams Pandit Nehru Over Syama Mokerjees Death - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జన సంఘ్‌ వ్యవస్ధాపకులు శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ మృతిపై విచారణ జరిపేందుకు దేశ తొలి ప్రధాని జవహరల్‌లాల్‌ నెహ్రూ నిరాకరించారని బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షులు జేపీ నడ్డా విమర్శించారు. ముఖర్జీ మృతిపై విచారణ జరిపించాలని దేశం యావత్తూ డిమాండ్‌ చేసినా పండిట్‌ నెహ్రూ అందుకు అంగీకరించలేదని చరిత్రే దీనికి ఆధారమని దుయ్యబట్టారు.

శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ త్యాగం వృధా కాదని, ఆయన సిద్ధాంతాలకు బీజేపీ కట్టుబడి ఉందని నడ్డా స్పష్టం చేశారు. ముఖర్జీ వర్ధంతి సందర్బంగా నడ్డా మాట్లాడుతూ దివంగత నేత ప్రదర్శించిన జాతీయవాదం దేశానికి సరైన దిశానిర్దేశం చేస్తుందని అన్నారు. పండిట్‌ నెహ్రూ బుజ్జగింపు రాజకీయాలకు వ్యతిరేకంగా ముఖర్జీ కాంగ్రెస్‌ పార్టీని వీడారని చెప్పారు. మరోవైపు డాక్టర్‌ ముఖర్జీ వర్దంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షా, పలువురు బీజేపీ సీనియర్‌ నేతలు దివంగత నేతకు ఘనంగా నివాళులు అర్పించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top