నా నిర్లక్ష్యం వల్లే కరోనా సోకింది: జితేంద్ర అవద్‌

Jitendra Awhad Over Corona Positive It Was My Reckless Behaviour - Sakshi

ముంబై: నిర్లక్ష్యపూరిత ధోరణి వల్లే తాను కరోనా వైరస్‌ బారిన పడ్డట్లు వెల్లడించారు మహారాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి జితేంద్ర అవద్‌. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోన్న సమయంలో ఆయన థానే జిల్లాకు పర్యవేక్షకుడిగా వ్యవహరించారు. ఈ క్రమంలో అధికారులతో సమీక్ష సందర్భంగా ఓ పోలీసు అధికారి నుంచి మంత్రికి వైరస్‌ సోకిన సంగతి తెలిసిందే. దాంతో ఈ నెల ప్రారంభంలో కొన్ని రోజుల పాటు ఆస్పత్రిలో ఉండి చికిత్స పొందారు‌. రెండు రోజులు వెంటిలేటర్‌ మీద కూడా ఉన్నారు. కరోనా నుంచి కోలుకుని ఇటివలే డిశ్చార్జ్‌ అయ్యారు జితేంద్ర అవద్. 

ఈ క్రమంలో తాజాగా డెవలపర్స్‌ లాబీ  బీడీఏ నిర్వహించిన ఓ ఆన్‌లైన్‌ సెమినార్‌లో పాల్గొన్నారు జితేంద్ర అవద్‌. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నా నిర్లక్ష్యం కారణంగానే కరోనా వ్యాధి సోకింది. నేను ప్రజల సలహాలు పాటించలేదు. అందుకే కరోనా వలలో చిక్కాను. కానీ నా సంకల్ప బలంతో త్వరగానే వ్యాధి నుంచి కోలుకున్నాను. ఇతర ఐఏఎస్‌ అధికారులతో పోల్చుకుంటే నేను చాలా అదృష్టవంతుడుని.  ప్లాస్మా థెరపీ, ఇంపోర్టెడ్‌ మందుల అవసరం లేకుండానే వ్యాధి నుంచి కోలుకున్నాను. ప్రస్తుతం నా హిమోగ్లోబిన్‌ లెవల్‌ బాగానే పెరిగింది. ఇందుకోసం కఠిన ఆహార నియమాలు పాటిస్తున్నాను’ అన్నారు జితేంద్ర.  (మ‌హారాష్ట్రలో మంత్రిని కూడా వ‌ద‌ల్లేదు..)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top