హోం క్వారంటైన్‌లోకి జార్ఖండ్‌ సీఎం | Jharkhand CM Undergoes Home Quarantine | Sakshi
Sakshi News home page

రాష్ట్ర మంత్రికి పాజిటివ్‌ : స్వీయ నిర్బంధంలో సీఎం

Jul 8 2020 2:57 PM | Updated on Jul 8 2020 5:33 PM

Jharkhand CM Undergoes Home Quarantine - Sakshi

స్వీయనిర్బంధంలోకి వెళ్లిన జార్ఖండ్‌ సీఎం

రాంచీ : జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ బుధవారం హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. పార్టీ ఎమ్మెల్యే మథుర మహతో, రాష్ట్ర మంత్రి మిథిలేష్‌ ఠాకూర్‌లకు కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో సీఎం స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. రాష్ట్ర మంత్రి, ఎమ్మెల్యే కరోనా వైరస్‌తో బాధపడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, ముందుజాగ్రత్త చర్యగా తాను బుధవారం నుంచి కొన్నిరోజులు స్వీయ నిర్బంధంలోకి వెళుతున్నానని సీఎం హేమంత్‌ సోరెన్‌  ట్వీట్‌ చేశారు.

తన కార్యాలయంలో పనిచేసే అధికారులు, సిబ్బంది అందరూ హోం క్వారంటైన్‌కు వెళ్లాలని ఆయన కోరారు. ముఖ్యమైన పనులను తాను ఇంటినుంచే నిర్వర్తిస్తానని చెప్పారు. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లోకి రావడం మానుకోవాలని, అత్యవసరమైతే మాస్క్‌లు ధరించే బయటకు రావాలని కోరారు. సీఎం సోరెన్‌ నివాసానికి వెళ్లే మార్గాలను అధికారులు మూసివేశారు.ఇక దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గం‍టల్లో అత్యధికంగా 22,752 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. మహమ్మారి బారినపడి ఒక్కరోజే 482 మంది మరణించారు. చదవండి : జార్ఖండ్‌: హేమంత్‌ సొరేన్‌ ముందున్న సవాళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement