‘మంచం’తో దున్నేశాడు! | jalgaon district farmer used bed cart for agriculture | Sakshi
Sakshi News home page

‘మంచం’తో దున్నేశాడు!

Jul 4 2016 5:52 PM | Updated on Oct 8 2018 5:52 PM

‘మంచం’తో దున్నేశాడు! - Sakshi

‘మంచం’తో దున్నేశాడు!

చేసిన అప్పులు ఎలా తీర్చాలని పొలంలో మంచంపై కూర్చుని మథనపడుతున్న సమయంలో ఈ ఆలోచన తట్టింది.

జల్ గావ్: పేద రైతులు పడే కష్టానికి ఈ చిత్రం ఒక ఉదాహరణ. రూ. 70,000 వెచ్చించి ఎడ్లు కొనే స్థోమత లేక మహారాష్ట్రలోని జల్ గావ్ జిల్లాకు చెందిన విఠల్ హరి మండోలే అనే  రైతు మంచంతో దుక్కి దున్ని వ్యవసాయం చేస్తున్నాడు. చేసిన అప్పులు ఎలా తీర్చాలని పొలంలో మంచంపై కూర్చుని మథనపడుతున్న సమయంలో ఈ ఆలోచన తట్టింది. తను కూర్చున్న మంచంతోనే దుక్కి దున్నొచ్చు కదా అని ఆలోచించాడు.

అనుకున్నదే తడవుగా మంచం తీసుకుని ఒక చివర రాళ్లు పెట్టి, మరో చివర తాను లాగుతూ కౌలుకు తీసుకున్న మూడెకరాల్లో సేద్యం చేస్తున్నాడు. ఇతను చేసే సేద్యం చూడడానికి చుట్టుపక్కల గ్రామాల రైతులు కూడా వచ్చి అభినందనలు తెలుపుతున్నారు. అన్నట్లు పుట్టెడు కష్టాల్లో ఉన్న ఈ రైతుకు ఎవరైనా దాతలు సహాయం చేయాలనుకుంటే 7798348533 నెంబరును సంప్రదించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement