రైల్వే ప్రయాణీకులకు శుభవార్త..

Indian Railways To Make More Vande Bharat Trains - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో తొలి సెమీ హైస్పీడ్‌ రైలు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా ఈ తరహా రైళ్లను మరికొన్నింటిని ప్రవేశపెట్టేందుకు రైల్వేలు ప్రయత్నిస్తున్నాయి. రానున్న రెండేళ్లలో కొత్తగా 40 వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లను ప్రారంభించేందుకు రైల్వేలు సన్నాహాలు చేస్తున్నాయి. సెమీ హైస్పీడ్‌ రైళ్ల కోసం ఇటీవల చేపట్టిన టెండర్‌ ప్రక్రియపై తీవ్ర విమర్శలు రావడంతో రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ జోక్యం చేసుకుని సమస్యను చక్కదిద్దారు. వందే భారత్‌​ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ల తయారీకి నూతన టెండర్‌ ప్రక్రియను రైల్వే బోర్డు చేపట్టడంతో ఈ రైళ్లు త్వరలో పట్టాలెక్కేందుకు కార్యాచరణ ప్రణాళిక ఖరారైంది. ప్రస్తుతం వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢిల్లీ, వారణాసి మధ్య రాకపోకలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. మేకిన్‌ ఇండియాలో భాగంగా వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top