ఉగ్ర మహమ్మారి

India records highest single-day spike of 22,771 COVID-19 cases - Sakshi

24 గంటల్లో 22,771 కరోనా పాజిటివ్‌ కేసులు

ఒక్కరోజులో 442 మంది మృతి

న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం ప్రదర్శిస్తోంది. పాజిటివ్‌ కేసుల విషయంలో పాత రికార్డులు చెదిరిపోతున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు 24 గంటల వ్యవధిలో కొత్తగా 22,771 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దేశంలో ఇప్పటివరకు ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. అలాగే 442 మంది బాధితులు కరోనాతో పోరాడుతూ మృత్యుఒడికి చేరారు. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో ఇప్పటివరకు మొత్తం కరోనా పాజిటివ్‌ కేసులు 6,48,315కు, మరణాలు 18,655కు చేరాయి. ప్రస్తుతం క్రియాశీల కరోనా కేసులు 2,35,433 కాగా, 3,94,226 మంది బాధితులు చికిత్సతో కోలుకున్నారు. గత 24 గంటల్లో 14,335 మంది కోలుకున్నారు. మొత్తం బాధితుల్లో 60.81 శాతం మంది కోలుకున్నట్లు స్పష్టమవుతోంది. భారత్‌లో జూన్‌ 1 నుంచి జూలై 4వ తేదీ దాకా 4,57,780 కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం.

రోజంతా అంబులెన్స్‌లోనే..
ప్రాణాలు కోల్పోయిన కోవిడ్‌ రోగి
ముంబై: కోవిడ్‌ సోకిన 64 ఏళ్ల వ్యక్తి వైద్యం అందక ప్రాణాలుకోల్పోయారు. ఈ ఘటన నవీముంబైలో జరిగింది. జూన్‌ 20న తన తండ్రి శ్వాసతీసుకోవడంలో ఇబ్బందిపడటంతో నవీముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎంఎంసీ) కోవిడ్‌ ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు అతని కొడుకు చెప్పారు. ఇక్కడ బెడ్లు ఖాళీలేవని ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాలని ఎన్‌ఎంఎంసీ సిబ్బంది చెప్పడంతో చాలా ఆస్పత్రులకు వెళ్లినా ఎవరూ చేర్పించుకోలేదన్నారు. దీంతో రోజంతా ఆక్సీజన్‌ ఉన్న అంబులెన్స్‌లో ఉంచాల్సి వచ్చిందన్నారు. చిట్టచివరకు ఓ ఆస్పత్రిలో చేర్పించినా ఆయన ప్రాణాలు దక్కలేదు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

11-08-2020
Aug 11, 2020, 10:45 IST
సాక్షి, హైదరాబాద్‌ : మలక్ పెట్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగి సోమవారం రాత్రి బలవన్మరణం చెందారు....
11-08-2020
Aug 11, 2020, 10:21 IST
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనం, పౌరుల జీవనోపాధిపై మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి కారణంగా...
11-08-2020
Aug 11, 2020, 10:06 IST
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసులు, మరణాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి....
11-08-2020
Aug 11, 2020, 09:07 IST
సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో కొత్తగా మరో 1896 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం...
11-08-2020
Aug 11, 2020, 08:51 IST
సాక్షి, పాలమూరు : మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో సోమవారం కరోనాతో మృతి చెందిన ఓ వ్యక్తి అంత్యక్రియల్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొన్నారు....
11-08-2020
Aug 11, 2020, 08:37 IST
లక్డీకాపూల్‌ : నిజామ్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నిమ్స్‌)లో  కొనసాగుతున్న కొవాక్జిన్‌ క్లినికల్‌ ట్రయిల్స్‌లో మొదటి అంకం విజయవంతంగా ముగిసింది....
11-08-2020
Aug 11, 2020, 07:59 IST
వీకెండ్‌ మూవీల్లేవు. ఫ్రెండ్స్‌తో పార్టీలు బంద్‌. అప్పుడప్పుడు వచ్చి పోయే బంధుమిత్రుల సందడి లేదు.ఇంటిల్లిపాది కలిసి వెళ్లే సరదాటూర్లు లేవు....
11-08-2020
Aug 11, 2020, 06:50 IST
సంగారెడ్డి అర్బన్‌: సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతో గుర్తింపుగా గౌరవ డాక్టరేట్‌తో పాటు, ఐదు ఆవార్డులు సొంతం చేసుకొని...
11-08-2020
Aug 11, 2020, 06:43 IST
అనంతపురం సెంట్రల్‌: నగరంలో జాయ్‌అలుకస్, మలబార్‌గోల్డ్‌ జ్యువెలరీ నిర్వాహకులు కోవిడ్‌–19 నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఇటీవల అనుమతులు లేకుండా తెరవడంతో పోలీసులు...
11-08-2020
Aug 11, 2020, 06:11 IST
లండన్‌: కోవిడ్‌ –19 సీజనల్‌గా వచ్చిపోయే వైరస్‌లాగా కనిపించడం లేదని, అందుకే దీన్ని కట్టడిచేయడం కష్టంగా మారిందని ప్రపంచ ఆరోగ్య...
11-08-2020
Aug 11, 2020, 05:59 IST
న్యూఢిల్లీ: భారత్‌లో వరుసగా నాలుగో రోజూ 60 వేలకు పైగా కేసులు వెలుగుచూశాయి. సోమవారం కొత్తగా 62,064 కేసులు బయట...
11-08-2020
Aug 11, 2020, 05:54 IST
సాక్షి, అమరావతి: కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో మైలురాయిని అధిగమించింది. సోమవారం నాటికి 25 లక్షల పరీక్షలు...
11-08-2020
Aug 11, 2020, 05:51 IST
జెనీవా: కరోనా వైరస్‌ కోరల్లో చిక్కుకొని ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు విలవిల్లాడుతు న్నారు.  కడుపు నింపుకునే మార్గం లేక పలక బలపం...
11-08-2020
Aug 11, 2020, 05:49 IST
సాక్షి, అమరావతి: వచ్చే నెల రెండో వారం నాటికి ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతుందని ఎపిడెమాలజిస్ట్‌లు(అంటువ్యాధుల నిపుణులు) చెబుతున్నారు....
11-08-2020
Aug 11, 2020, 05:24 IST
ఎట్టకేలకు కరోనా నియంత్రణకు ఓ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుంది!
11-08-2020
Aug 11, 2020, 01:25 IST
అటో పరిశ్రమను కరోనా సంక్షోభం వెంటాడుతూనే ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జూలైలో ప్యాసింజర్‌ వాహనాల విక్రయాలు...
11-08-2020
Aug 11, 2020, 00:29 IST
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కోవిడ్‌–19, లాక్‌డౌన్‌ అడ్డంకులు ఉన్నప్పటికీ భారత్‌ నుంచి ఔషధ ఎగుమతులు ఏప్రిల్‌–జూన్‌లో వృద్ధి చెందాయి. ఫార్మాస్యూటికల్స్‌...
11-08-2020
Aug 11, 2020, 00:09 IST
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కరోనా వైరస్‌ మహమ్మారి, లాక్‌డౌన్‌ అంశాలు జీవిత బీమా రంగంపైనా ప్రతికూల ప్రభావాలు చూపించాయి. అయితే,...
10-08-2020
Aug 10, 2020, 20:29 IST
సాక్షి, హైద‌రాబాద్‌: ఆగ‌స్టు 15న జ‌రగ‌నున్న‌ స‌్వాతంత్ర్య దినోత్స‌వ సంబ‌రాల‌పై హైకోర్టు కీల‌క ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర హోం శాఖ,...
10-08-2020
Aug 10, 2020, 19:17 IST
ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 46,699 కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా 7,665 మందికి పాజిటివ్‌గా తేలింది.
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top