రోహింగ్యాల అక్రమ చొరబాట్లు | India identifies 140 vulnerable locations along Bangladesh border | Sakshi
Sakshi News home page

రోహింగ్యాల అక్రమ చొరబాట్లు

Oct 7 2017 9:53 AM | Updated on Oct 7 2017 9:53 AM

India identifies 140 vulnerable locations along Bangladesh border

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దులో భద్రత తక్కువగా ఉన్న సుమారు 140 ప్రాంతాలనుంచి రోహింగ్యాలు అక్రమంగా చొరబాడేందుకు ప్రయత్నిస్తున్నారని బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ చీఫ్‌ కేకే శర్మ తెలిపారు.ఈ నేపథ్యంలో సరిహద్దులో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరముందుని ఆయన అన్నారు. అక్రమంగా చొరబడుతున్న రోహింగ్యాలకు కొన్ని ముఠాలు సహకరిస్తున్నాయని.. ఆ ముఠాలను ఏరిపారేయాల్సిన అవసరముందని చెప్పారు. బీఎస్‌ఎఫ్‌, బోర్డర్‌ గార్డ్‌ ఆఫ్‌ బంగ్లాదేశ్‌ల వార్షిక సమావేశం న్యూఢిల్లీ ముగిసిం‍ది. ఈ సమావేశంలో బీఎస్‌ఎఫ్‌ చీప్‌ కేకే శర్మ, బీజీబీ చీఫ్‌ జనరల్‌ అబుల్‌  హాసన్‌ రోహింగ్య అక్రమ చొరబాట్లపై చర్చించారు.

ఈ సందర్భంగా రోహింగ్యాలు బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని.. వారికి సరిహద్దు గ్రామాల్లోని కొందరు సహకారం అందిస్తున్నారని తెలిపారు. అంతేకాక రోహింగ్యాల వల్ల ఉగ్రవాదపెనుముప్పు పొంచి ఉందని అన్నారు.  దీనిపై స్పందించిన అబుల్‌ హాసన్‌.. ఈ విషయంలో బంగ్లాదేశ్‌ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉందని.. ఉగ్రవాదానికి బంగ్లా సహకారం అందించదని తెలిపారు. మయన్మార్‌, బంగ్లా సరిహద్దులో కంచె నిర్మాణం చేయాలనే ఆలోచనలో బంగ్లా ప్రభుత్వం ఉన‍్నట్లు ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement