మేఘాలయ గవర్నర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

If You Do Not Want it Go to North Korea : Governor - Sakshi

షిల్లాంగ్‌ : పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వారిని ఉద్దేశించి మేఘాలయ గవర్నర్‌ తథాగత రాయ్‌ శుక్రవారం వివాదాస్పద ట్వీట్‌ చేశారు. అలాంటి వారు నార్త్‌ కొరియాకు వెళ్లిపోవచ్చని సూచించారు. పౌరసత్వ చట్టంపై నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన ట్విటర్‌లో స్పందిస్తూ.. రెండు వాస్తవ విషయాలను వివాదాస్పదంగా ఎప్పుడూ చూడకూడదు. 1. దేశ విభజన మతం కారణంగా జరిగింది. 2. విభజిత ప్రజాస్వామ్యం ఈ దేశానికి అవసరం. ఈ రెండింటిపై ఎవరైనా విభేదిస్తే వారు నిరభ్యంతరంగా ఉత్తర కొరియాకు వెళ్లొచ్చు అని ట్వీట్‌ చేశారు.

గవర్నర్‌ వ్యాఖ్యలపై ఆగ్రహించిన నిరసనకారులు రాజభవన్‌ను ముట్టడించడానికి ప్రయత్నించారు. భద్రతా బలగాలను దాటి లోపలికి ప్రవేశించాలని యత్నం చేశారు. పరిస్థితి అదుపు తప్పుతుందని గ్రహించిన పోలీసులు నిరసనకారులపై లాఠీచార్జ్‌ జరిపారు. అనంతరం టియర్‌ గ్యాస్‌ను ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ ఘటనలో పలువురు నిరసనకారులతో పాటు ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top