గుర్గావ్ మహిళ ముందుచూపు!

గుర్గావ్ మహిళ ముందుచూపు! - Sakshi


గుర్గావ్: ఆమెకు గుర్గావ్ లో 3 కోట్ల విలువ చేసే ఇల్లుంది. అంతేకాదు రెండు పెద్ద కార్లు కూడా ఉన్నాయి. ఇన్ని ఉన్న ఆమె ఉన్నత ఉద్యోగో, బడా వ్యాపారవేత్తో కాదు. రోడ్డు పక్కన చిన్న బండిలో హోటల్ నడుపుతోంది. ఇదంతా ఎందుకు చేస్తున్నావని అడిగితే 'నా కుటుంబానికి సురక్షితమైన భవిష్యత్ అందిచేందుకే'నని జవాబచ్చింది.

 

ఊర్వశి యాదవ్ అనే మహిళ 45 రోజులుగా రోడ్డు పక్కన బండి పెట్టి టిఫిన్ సెంటర్ నడుపుతోంది. టీచర్ గా పనిచేసిన ఆమె తన భర్తకు ప్రమాదం జరగడంతో ఉద్యోగాన్ని వదిలేసి టిఫిన్ సెంటర్ ప్రారంభించింది. గుర్గావ్ సెక్టార్ 17ఏ యాదవ్ కుటుంబం నివాసం ఉంటుంది. ఆమె భర్త అమిత్ ప్రముఖ నిర్మాణ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నాడు. ఆమె మామ ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్ వింగ్ కమాండర్ గా రిటైరయ్యారు. మే 31న జరిగిన అమిత్ గాయపడ్డాడు. అతడికి తుంటి మార్పిడి ఆపరేషన్ చేయాలని, నడిచే అవకాశాలు తక్కువని డాక్టర్లు చెప్పారు. ఇది జరిగిన 15 రోజుల తర్వాత సెక్టార్ 14 మార్కెట్ లో రావి చెట్టు కింద చిన్న బండి పెట్టి టిఫిన్ ప్రారంభించింది ఊర్వశి యాదవ్.



'ఇప్పటికిప్పుడు మాకు ఎటువంటి ఆర్థిక సమస్యలు లేవు. కానీ భవిష్యత్ లో ఎలా ఉంటుందో చెప్పలేను. కష్టాలు ఎదురొనప్పుడు చూడొచ్చు అన్నట్టుగా కాకుండా, ముందుగానే సిద్ధంగా ఉంటే మంచిదన్న నిర్ణయంతో టిఫిన్ సెంటర్ పెట్టాను. టీచర్ గా ఉద్యోగం చేస్తూ నాకు కావాల్సిన డబ్బు సంపాదించలేనని అర్థమైంది. వంట చేయడమంటే నాకు ఇష్టం. నా అభిరుచినే ఉపాధిగా ఎందుకు మార్చుకోకూడదన్న ఆలోచనతో టిఫిన్ సెంటర్ ప్రారంభించా'నని ఊర్వశి యాదవ్ చెప్పింది. తన ఇద్దరు పిల్లలను మంచి స్కూల్లో చదుతున్నారని, వారిని స్కూల్ మార్చాలన్న ఆలోచన లేదని పేర్కొంది. రోజుకు రూ.2500 నుంచి రూ.3000 సంపాదిస్తున్నానని, తన సంపాదన సంతృప్తికరంగా ఉందని వెల్లడించింది. ఊర్వశి యాదవ్ ముందుజాగ్రత్తను అక్కడి వారు ప్రశంసిస్తున్నారు.



 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top