పట్టపగలే గుర్తు తెలియని దొంగలు ఇంట్లోకి చొరబడి సర్వం దోచారు. ఇంట్లోని మహిళ కణతకు తుపాకీ గురిపెట్టి విలువైన వస్తువులన్నింటిని ఎత్తుకెళ్లారు.
నోయిడా: పట్టపగలే గుర్తు తెలియని దొంగలు ఇంట్లోకి చొరబడి సర్వం దోచారు. ఇంట్లోని మహిళ కణతకు తుపాకీ గురిపెట్టి విలువైన వస్తువులన్నింటిని ఎత్తుకెళ్లారు. సహాయం కోసం చుట్టుపక్కలవారిని పిలిచే ప్రయత్నం చేయగా ఆమెను పిచ్చికొట్టుడు కొట్టి వెళ్లారు. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. బదల్పూర్ లోని డిఫెన్స్ ఎన్క్లేవ్ ప్రాంతంలో రాజ్ హన్స్ శర్మ అనే వ్యక్తి ఇంట్లోకి శుక్రవారం ఉదయం 11గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు.
అందులో ఓ వ్యక్తి తలుపు తీయాలని అలారం కొట్టాడు. అశోక్ ఎవరో తమకు తెలియదని ఆమె చెప్పగా తన భర్తకు తెలుసని పెన్ను కావాలని అడిగాడు. పెన్నును ఆమె డోర్ తీయకుండా డోర్ కింద నుంచి ఇచ్చింది. ఆ తర్వాత నోట్ బుక్ కావాలని అడిగారు. అయితే, నోట్ బుక్ కూడా అలాగే ఇచ్చేందుకు ప్రయత్నం చేయగా అది రావడం లేదన్నట్లు వారు నటించారు. ఆమెకు ఏవో మాయమాటలు చెప్పి డోర్ కొంచెం ఓపెన్ చేసి ఇచ్చేటట్లుగా చేశారు. ఆమె అలా డోర్ లాక్ ఓపెన్ చేసిందో లేదో వెంటనే దబాళ్లుమని లోపలికి తోసుకొచ్చి ఆమెకు పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టారు. అనంతరం మరో ఇద్దరు దొంగలు సర్వం దోచుకున్నారు. ఆమె అరిచే ప్రయత్నం చేయడంతో బాగా కొట్టి పోయారు.