బ్యాంక్‌ ఖాతాలు తెరవండి

Govt directs NGOs to open account in any designated bank in a month for transparency - Sakshi

ఎన్జీవోలకు హోంశాఖ ఆదేశం

న్యూఢిల్లీ: విదేశీ విరాళాలు స్వీకరించే ఎన్జీవోలు, వ్యాపార సంస్థలు, వ్యక్తులు నెలలోగా ప్రభుత్వం నిర్దేశించిన 32 బ్యాంకుల్లో ఖాతాలు తెరవాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. పారదర్శకత పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ ఖాతాలను ప్రజా ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (పీఎఫ్‌ఎంఎస్‌)తో అనుసంధానం చేయనున్నట్లు తెలిపింది.  విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) 2010 ప్రకారం విదేశీ విరాళాలను జాతి వ్యతిరేక కార్యకలాపాలకు వాడకూడదని  తెలిపింది. కేంద్రం నిర్దేశించిన బ్యాంకుల్లో ఎస్‌బీఐ, విజయ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐడీబీఐ, యాక్సిస్‌ తదితర బ్యాంకులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో 10వేల ఎఫ్‌ఆర్‌సీఏ గుర్తింపు పొందిన ఎన్జీవోలు ఉన్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top