పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీ పెంపు | Government hikes excise duty on petrol by 37 paise per litre and Rs 2 per litre on diesel | Sakshi
Sakshi News home page

పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీ పెంపు

Jan 2 2016 5:01 PM | Updated on Sep 3 2017 2:58 PM

పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీ పెంపు

పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీ పెంపు

అంతర్జాతీయ చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో ఓవైపు పెట్రోల్, డీజిల్ తగ్గుతుంటే, మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని పెంచుతోంది.

న్యూఢిల్లీ: అంతర్జాతీయ చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో ఓవైపు పెట్రోల్, డీజిల్ తగ్గుతుంటే, మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని పెంచుతోంది. డిసెంబర్ 31న పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గిన విషయం తెలిసిందే. అయితే రెండు రోజుల్లోనే వీటిపై కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది.

 

లీటర్ పెట్రోల్‌పై 37 పైసలు, డీజిల్ పై లీటరు రెండు రూపాలయ చొప్పున ఎక్సైజ్ సుంకం పెంచుతూ శనివారం నిర్ణయం తీసుకుంది. ఎక్సైజ్ డ్యూటీ పెంపుతో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరగనున్నాయి. కాగా  ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ఐదుసార్లు ఎక్సైజ్‌ డ్యూటీ ప్రజలకు తెలపకుండా బడ్జెట్‌ శాంక్షన్‌ లేకుండా పెట్రోలు పదార్ధాలపై పెంచుకుంటూ పోతున్న విషయం తెలిసిందే.

 

Advertisement
 
Advertisement
Advertisement