100 స్టేషన్లలో ఉచిత వై-ఫై సేవలు | Sakshi
Sakshi News home page

100 స్టేషన్లలో ఉచిత వై-ఫై సేవలు

Published Thu, Feb 25 2016 1:03 PM

100 స్టేషన్లలో ఉచిత వై-ఫై సేవలు

న్యూఢిల్లీ: కొత్తగా మూడు రైలు సర్వీసులు ప్రారంభించనున్నట్టు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. 2016 సంవత్సరానికి గాను లోక్ సభలో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ లో హమ్ సఫర్, తేజస్, ఓవర్ నైట్ డబుల్ డెక్కర్ ఉదయ్ ఎక్స్‌ ప్రెస్ సర్వీసులను ఆయన ప్రకటించారు.  ఫుల్లీ ఎయిర్ కండీషన్డ్ థర్డ్ క్లాస్ బోగీలతో హమ్ సఫర్ ఎక్స్ ప్రెస్ ఉంటుందని వెల్లడించారు.

తేజస్ ఎక్స్ ప్రెస్ 130 కిలోమీటర్ల వేగంతో వెళుతుందని చెప్పారు. ఇందులో వై-ఫై, వినోదం సహా అత్యాధునిక సదుపాయాలు ఉంటాయని తెలిపారు. రిజర్వేషన్ లేని ప్రయాణికులకు కోసం అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, దీన్ దయాళ్ బోగీలు ప్రవేశపెడుతున్నట్టు  వీటిలో మంచినీళ్లు, చార్జింగ్ పాయింట్లు సహా అన్ని సదుపాయాలు ఉంటాయని వెల్లడించారు. 100 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సేవలు కల్పిస్తామని, రెండేళ్లలో మరో 400 స్టేషన్లకు విస్తరిస్తామని హామీయిచ్చారు.

Advertisement
Advertisement