న్యూ ఇయర్‌ ఆఫర్‌

Five Lakh Price Money For New Year Born First 24 Girl Childs Karnataka - Sakshi

ఆ రోజు పుట్టిన అదృష్ట లక్ష్మికి రూ. 5 లక్షల నగదు

ఆడ పిల్లలకు బెంగళూరు పాలికె నజరానా

కర్ణాటక, బనశంకరి : 2019 న్యూ ఇయర్‌ తొలిరోజున జన్మించిన 24 మంది ఆడపిల్లలకు బీబీఎంపీ నుంచి రూ.5 లక్షలు బంపర్‌ బహుమానం అందించనుందని మేయర్‌ గంగాంబిక తెలిపారు. బుధవారం బీబీఎంపీ సమావేశం వాయిదా పడిన అనంతరం గంగాంబికా విలేకరులతో మాట్లాడారు. గత ఏడాది నుంచి బీబీఎంపీ పింక్‌ బేబీ పేరుతో న్యూ ఇయర్‌ మొదటి రోజున జన్మించిన ఆడపిల్లలకు రూ.5 లక్షలు అందించే పథకం అమల్లోకి తీసుకువచ్చింది.

ఈ ఏడాది కూడా పింక్‌ బేబి పథకాన్ని కొనసాగిస్తామని మేయర్‌ తెలిపారు. బీబీఎంపీ పరిధిలోని పాలికె 24 ఆసుపత్రిల్లో ఏడాది మొదటిరోజు పుట్టిన 24 మంది ఆడపిల్లలకు తలా రూ.5 లక్షల చొప్పున ప్రోత్సాహక ధనం డిపాజిట్‌ చేస్తామని తెలిపారు. ఈసారి పింక్‌బేబి ప«థకాన్ని కొనసాగించడంతో పాటు రూ.5 లక్షల నగదు ఆడపిల్ల విద్యాభ్యాసానికి ఎంతో అనుకూలం అవుతుందన్నారు. జనవరి 1 తేదీన జన్మించిన మొదటి మగబిడ్డకు ఈ పథకం వర్తించదని తెలిపారు. ఒక వేళ జనవరి 1 తేదీన ఆడపిల్లలు జన్మించకుండా 2 తేదీ పుట్టినా అలాంటి ఆడపిల్లలకు రూ.5 లక్షల ప్రోత్సాహక ధనం అందిస్తామని మేయర్‌ తెలిపారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top