ఫేక్ సర్వేతో కాంగ్రెస్, బీజేపీ గుద్దులాట!
ప్రపంచంలోని అవినీతి రాజకీయపార్టీల్లో కాంగ్రెస్‌కు నాలుగో స్ధానం.
ప్రపంచంలోని అవినీతి రాజకీయపార్టీల్లో కాంగ్రెస్‌కు నాలుగో స్ధానం. ఇది బీబీసీ పేరుతో విడుదలైన ప్రపంచంలోని టాప్ 10 అవినీతి రాజకీయ పార్టీల జాబితా. అంతే ఒక్కసారిగా ట్విట్టర్ వేదికగా జాతీయ రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. వచ్చిన సర్వే వివరాలు నిజమో.. కాదో తెలుసుకోకుండానే ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలతో ట్విట్ల వర్షాన్ని కురిపించారు ఇరు పక్షాల నాయకులు.
దీంతో ఈ వార్త ఆ సోషల్ మీడియాలో వేగంగా పాకింది. ఈ వివరాలను పెద్ద బ్యానర్‌లా సృష్టించి పోస్టును తెగ షేర్ చేసేశాడు సగటు నెటిజన్. ఆఖరికి బీబీసీ కలుగజేసుకుని అసలు ఆ సర్వేతో తమకు ఎలాంటి సంబంధంలేదని తేల్చిచెప్పడంతో అందరూ నాలుక కరుచుకున్నారు. పాకిస్తాన్‌కు చెందిన ఓ ఫేక్ వెబ్‌సైటు ఈ సర్వేను సృష్టించినట్లు గుర్తించారు.