కొత్త ఇంటికి దారేది..

Fadnavis Hunts For New Home In Mumbai - Sakshi

ముంబై : మహారాష్ట్ర సీఎంగా రెండోసారి పాలనా పగ్గాలు చేపట్టి 80 గంటల్లోనే రాజీనామా చేసిన దేవేంద్ర ఫడ్నవీస్‌ రాష్ట్రానికి కొత్త సారథి రావడంతో అధికార నివాసం ఖాళీ చేసి కొత్త ఇంటిని అన్వేషించే పనిలో పడ్డారు. నాగపూర్‌కు చెందిన ఫడ్నవీస్‌ కుటుంబంతో సహా ముంబైలోనే నివసిస్తుడటంతో నగరంలో మరో ఇంటి కోసం వేట మొదలుపెట్టారు. ఫడ్నవీస్‌ భార్య అమృత యాక్సిస్‌ బ్యాంక్‌లో సీనియర్‌ పొజిషన్‌లో ఉండగా కుమార్తె ముంబైలోనే చదువుతున్నారు.

2014 అక్టోబర్‌లో ఫడ‍్నవీస్‌ ముఖ్యమంత్రి కాగానే వారు నాగపూర్‌ నుంచి ముంబైకు మకాం​ మార్చారు. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన ఫడ్నవీస్‌ నూతన అసెంబ్లీలో విపక్ష నేతగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. మరోవైపు మహా సీఎంగా ఉద్ధవ్‌ ఠాక్రే గురువారం ప్రమాణ స్వీకారం చేస్తున్న క్రమంలో అదే సమయంలో ఫడ్నవీస్‌ తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన ఇంటి వద్ద ప్యాకర్స్‌ అండ్‌ మూవర్స్‌ వాహనాలు కనిపించాయి.

చదవండికొలువుతీరిన ఠాక్రే సర్కార్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top