టీచర్స్ డే రోజు గోవా సీఎం ఏమన్నారంటే...
ప్రశ్నించడం బాల్యం నుంచే అలవాడలని గోవా సీఎం మనోహర్ పారికర్ అన్నారు.
పనాజీః ప్రశ్నించడం బాల్యం నుంచే అలవడాలని గోవా సీఎం మనోహర్ పారికర్ అన్నారు. తమ ప్రశ్నలపై ఉపాధ్యాయులు ఆగ్రహిస్తే తనకు మెయిల్ చేయాలని పిల్లలకు సూచించారు. ‘ బాలలు భయపడాల్సిన పనిలేదు...మీ ప్రశ్నలపై టీచర్లు కోప్పడితే నాకు ఈ మెయిల్ పంపండ’ ని పనాజీలో జరిగిన టీచర్స్ డే కార్యక్రమంలో అన్నారు.నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను చిన్నారులకు అందించడమే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు.
పిల్లల్లో ఆలోచన రేకెత్తించేలా మనం వారికి శిక్షణ ఇవ్వాలి...వారి ప్రశ్నలు కొన్ని సార్లు సంక్లిష్టంగా ఉంటాయని తెలుసు..అయినా విజ్ఞానం పొందే సామర్థ్యాన్ని మనం కల్పించాల’ ని అన్నారు. ఈ దిశగా విద్యా వ్యవస్థలోమార్పులు చోటుచేసుకోవాలని పారికర్ ఆకాంక్షించారు.