‘సీజే అభిశంసనపై చర్చిస్తున్నాం’

Discussing possible impeachment motion against CJI  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ దీపక్‌ మిశ్రా అభిశంసనపై ఇతర పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నామని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు. రానున్న బడ్జెట్‌ సమావేశాల్లో సీజేఐపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు వివిధ పార్టీలతో చర్చిస్తున్నామన్నారు. కేసుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారంటూ సీజేఐపై నలుగురు సీనియర్‌ సుప్రీం న్యాయమూర్తులు ఆరోపించిన నేపథ్యంలో ఏచూరి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

రెబెల్‌ జడ్జీలు లేవనెత్తిన అంశాలపై విచారణ చేపట్టాలని ఇప్పటికే కాంగ్రెస్‌, సీపీఎం డిమాండ్‌ చేశాయి. కాగా ఈనెల 29 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న 2018-19 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top