దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ క్రమేణా పెరుగుతోంది.
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ క్రమేణా పెరుగుతోంది. బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయానికి 48 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్టు ఢిల్లీ ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉదయం 8 గంటలకు ఆరంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.
ఢిల్లీ శాసనసభలో ఉన్న 70 స్థానాలకు 810 అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్ధన్, ప్రియాంకా గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా, ఢిల్లీ ఎన్నికల ప్రధాన అధికారి విజయ్ దేవ్ తదితరులు ముందుగానే ఓట్లు వేశారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల మాదిరిగా ఇక్కడా అత్యధిక పోలింగ్ నమోదవుతుందని భావిస్తున్నారు.