గుజరాత్ లో ఫ్లైఓవర్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరుకుంది.
ఫ్లైఓవర్ కూలిన ఘటనలో 9కి చేరిన మృతుల సంఖ్య
Jun 11 2014 5:17 PM | Updated on Oct 2 2018 8:13 PM
సూరత్: గుజరాత్ లో ఫ్లైఓవర్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరుకుంది. గుజరాత్ లో సూరత్ పట్టణంలోని పార్లే పాయింట్ ఏరియాలో మంగళవారం నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కూలిన సంగతి తెలిసిందే.
నిన్న జరిగిన ఘటనలో మొత్తం 15 మంది శిధిలాల కింద చిక్కుకుపోగా .. అందులో నుంచి ఇప్పటి వరకు 9 మృతదేహాలను, ఆరుగురు క్షతగాత్రులను అగ్నిమాపక దళం వెలికి తీశారని అధికారులు వెల్లడించారు. సహాయక కార్యక్రమాలు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
ప్రమాదం జరిగిన వెంటనే ఈ ఘటనలో మరణించిన ఐదుగురు కార్మికుల మృతదేహాలను గత రాత్రే బయటకు తీశామన్నారు. ఈ దుర్ఘటనపై గుజరాత్ ముఖ్యమంత్రి ఆనంది బెన్ విచారణకు ఆదేశించారు.
Advertisement
Advertisement