ఆర్‌ఎస్‌సీఐ చైర్మన్‌గా సీవీఎల్ శ్రీనివాస్ | cvl srinivas as RSCI chairman | Sakshi
Sakshi News home page

ఆర్‌ఎస్‌సీఐ చైర్మన్‌గా సీవీఎల్ శ్రీనివాస్

Nov 26 2015 3:19 AM | Updated on Sep 3 2017 1:01 PM

రీడర్‌షిప్ స్టడీస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఆర్‌ఎస్‌సీఐ) చైర్మన్‌గా గ్రూప్‌ఎం సౌత్ ఆసియా సంస్థ సీఈవో సి.వి.ఎల్.శ్రీనివాస్ నామినేట్ అయినట్లు ఆర్‌ఎస్‌సీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది.

ముంబై: రీడర్‌షిప్ స్టడీస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఆర్‌ఎస్‌సీఐ) చైర్మన్‌గా గ్రూప్‌ఎం సౌత్ ఆసియా సంస్థ సీఈవో సి.వి.ఎల్.శ్రీనివాస్ నామినేట్ అయినట్లు ఆర్‌ఎస్‌సీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటివరకు కొనసాగిన హర్ముస్‌జీ కామా నుంచి చైర్మన్‌గా శ్రీనివాస్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారని, రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారని పేర్కొంది.

వివిధ పత్రికల రీడర్‌షిప్ సర్వేలు నిర్వహించే ‘ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ (ఏబీసీ)’, ‘మీడియా రీసెర్చ్ యూజర్స్ కౌన్సిల్ (ఎంఆర్‌యూసీ)’ సంస్థలు ఉమ్మడిగా రీడర్‌షిప్ స్టడీస్‌ను చేపట్టాలనే అవగాహనకు రావడంతో ఆర్‌ఎస్‌సీఐ ఏర్పాటైంది. ఇందులో వివిధ పత్రికలు, ప్రకటనల ఏజెన్సీల ప్రతినిధులు, ప్రకటనలు ఇచ్చే సంస్థల ప్రతినిధులు కలిపి 20 మంది సభ్యులు ఉంటారు.

ఆర్‌ఎస్‌సీఐ పాలకమండలి ఇండియన్ రీడర్‌షిప్ సర్వే కోసం ఎన్.పి.సత్యమూర్తి ఆధ్వర్యంలో ఒక సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. ఆర్‌ఎస్‌సీఐ చైర్మన్‌గా శ్రీనివాస్ ఎంపిక పట్ల ఏబీసీ చైర్మన్ శశిసిన్హా హర్షం వ్యక్తం చేశారు. 2016 రీడర్‌షిప్ సర్వేకు ఆయన సరైన మార్గదర్శకత్వం చూపగలరని పేర్కొన్నారు.

Advertisement

పోల్

Advertisement